Home  »  TV News  »  పాగల్ పవిత్ర కళ నెరవేరిందంట!

Updated : Jul 31, 2023

జబర్దస్త్ పవిత్ర.. ఇప్పుడు అందరికి సుపరిచితమే. జబర్దస్త్ లో తన కామెడీ టైమింగ్ తో అందరి ప్రశంసలు పొందిన పవిత్ర.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. జబర్దస్త్ స్టేజ్ మీద తన సత్తా నిరూపించుకొని ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. జీతెలుగులో వస్తున్న సూపర్ క్వీన్ లో వాళ్ళ అమ్మని తీసుకొచ్చి తన జీవితం ఎలా ఉందో చెప్తూ ఎమోషనల్ అవడంతో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

జబర్దస్త్ ఎంతో మంది ఆర్టిస్ట్ లకి అవకాశం ఇచ్చింది. ఇందులో తమ కామెడీతో నవ్వించి, సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నవారు చాలామందే ఉన్నారు. అయితే ఒకప్పుడు జబర్దస్త్ లో ధనరాజ్, వేణు, సుడిగాలి సుధీర్, చలాకీ చంటి, చమ్మక్ చంద్ర లతో సూపర్ స్కిట్ లతో సక్సెస్ అయిన జబర్దస్త్.. ఇప్పుడు టీఆర్పీలోనూ వెనుకబడింది. అయితే కొత్తగా ఆర్టిస్ట్ లను తీసుకొని కొత్త టీం లీడర్స్, కొత్త టీమ్స్ ని తీసుకొని మళ్ళీ కామెడీని సరికొత్తగా తీసుకొస్తుంది జబర్దస్త్‌. ఇలా కొత్తగా వచ్చిన వారిలో నూకరాజు, ఇమాన్యుయల్, పవిత్ర లాంటి వారు ఉన్నారు. అయితే జబర్దస్త్ కామెడీ షోలో ఒకప్పుడు లేడీ కమెడియన్లు ఉండేవాళ్ళు కాదు. అబ్బాయిలే అమ్మాయిల వేషం వేసుకొని కామెడీ చేసేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా బాగానే కన్పిస్తున్నారు. భాస్కర్ టీం, వెంకీ మంకీస్ టీం, రాకెట్ రాఘవ టీం ఇలా అందరి టీంలలో కామన్ గా ఉంటున్న పవిత్ర.. తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటుంది. 

ఇమాన్యుయల్ తో కలిసి పవిత్ర రెగ్యులర్ రా రీల్స్ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంటుంది. కాగా ఆ వీడియోలకి విశేష స్పందన లభిస్తుంది. అయితే పాగల్ పవిత్ర పేరుతో తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసింది. అందులో రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ అందరికీ దగ్గరవుతుంది. అయితే తాజాగా " నా కళ నెరవేరిన వేళ" అంటూ ఒక వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది. ఇందులో తను కార్ డ్రైవ్ చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ రితన్య, మానసతో కలిసి లాంగ్ టూర్ కి వెళ్తుందంట.. కార్ కొని సంవత్సరం అయినా ఒక్కసారి కూడా డ్రైవ్ చేయలేదంట.. ఫస్ట్ టైమ్ సర్ ప్రైజ్ గా ఎయిర్ పోర్ట్ కి లాంగ్ డ్రైవ్ చేస్తూ వెళ్తుందంట.. అయితే తనని నమ్మి తన ఫ్రెండ్స్ వస్తున్నారని, చూడాలి మరి ఈ రోజు‌ ఎలా ఉంటుందో అంటూ తన హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంది. తన యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబర్స్ కి థాంక్స్  చెప్పింది పవిత్ర. ఇదంతా తన వ్లాగ్ లో చెప్పింది పవిత్ర.. కాగా ఈ వ్లాగ్ కి విశేష స్పందన లభిస్తుంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.